ఉత్తర కాలిఫోర్నియా కార్చిచ్చు దుర్ఘటన: 'తాతయ్యా... కాపాడు' అని అరుస్తూ ప్రాణాలు వదిలిన ఐదేళ్ల చిన్నారి!
- ఉత్తర కాలిఫోర్నియాలో ఇళ్లపైకి కార్చిచ్చు
- వృద్ధురాలు, ఇద్దరు చిన్నారులు సజీవదహనం
- మరో 5 వేల ఇళ్లకు ముప్పు ఉందంటున్న అధికారులు
'తాతయ్య రా.. నన్ను కాపాడు' అని ముని మనవడు జేమ్స్ రాబర్ట్స్ పిలుస్తుంటే, తన ముసలి గుండె బద్దలైందని అన్నాడు. మంటలు తనను లోనికి వెళ్లనివ్వలేదని చెప్పాడు. కాగా, ఈ ప్రమాదంలో బెల్డ్ సోయి భార్య మెలోడీ, ఆయన ముని మనవడు జేమ్స్ ఎమిలీ కూడా సజీవ దహనం అయ్యారు. సోమవారం నాటికి దాదాపు లక్ష ఎకరాలను మంటలు కబళించాయని చెప్పిన అధికారులు, 700కు పైగా గృహాలు దగ్ధమయ్యాయని, మరో 5 వేలకు పైగా గృహాలు ప్రమాదంలో ఉన్నాయని, వాటి నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని అన్నారు.