టీటీడీ కీలక నిర్ణయం... ఇకపై తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలోనూ బ్రేక్ దర్శనాలు
- రెండు దఫాలుగా వీఐపీ బ్రేక్ దర్శనం
- టికెట్ ఖరీదు రూ. 250
- వెల్లడించిన డిప్యూటీ ఈఓ మునిరత్నం రెడ్డి
బుధవారం నుంచి వీఐపీ బ్రేక్ అమలవుతుందని, ఉదయం 11.30 నుంచి 12 గంటల వరకు, రాత్రి 7 గంటల నుంచి 7.30 గంటల వరకూ సామాన్య భక్తుల క్యూలైన్లను నిలిపి వీఐపీలకు దర్శన సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ ధరను రూ. 250గా నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 4.30 వరకూ యథావిధిగా కుంకుమార్చన ఉంటుందని అన్నారు. రేపటి నుంచి కొన్ని సేవలు, ఆలయ వేళల్లో మార్పులుంటాయని, తెల్లవారుజామున 4.30కి ఆలయాన్ని తెరిచి, రాత్రి 9.30కి మూసేస్తామని తెలిపారు.