బిచ్చగత్తె ఒడిలో అందాల పసిపాప... అసలు విషయాన్ని తేల్చిన పోలీసులు!
- పిల్లల కిడ్నాపర్ అంటూ వైరల్
- రంగంలోకి దిగి మహిళను గుర్తించిన జోధ్ పూర్ పోలీసులు
- పక్కింటి వారి బిడ్డని తేల్చిన పోలీసులు
ఈ ఫొటో వైరల్ అవుతూ ఉండటంతో జరగరానిది జరిగేలోగానే ఆమెను గుర్తించాలని నిర్ణయించిన పోలీసులు, శనీశ్వరుని గుడి ముందు ఆమెను గుర్తించి అరెస్ట్ చేశారు. ఆపై విచారించగా, ఆమె యాచకురాలని, దేవాలయం పొరుగున ఉండే మహిళ ఆ బిడ్డను కాసేపు చూస్తుండమని చెప్పి చేతుల్లో పెట్టి వెళ్లిందని, అంతలోనే ఈ ఫొటోను తీశారని జోధ్ పూర్ డీసీపీ అమన్ దీప్ సింగ్ వెల్లడించారు. పొరుగింటి మహిళను కూడా విచారించామని, బిడ్డ జన్మించిన ఆసుపత్రి రికార్డులను, డైపర్ కొనుగోలు చేసిన దుకాణం యజమానిని విచారించి, దర్యాఫ్తుతో తృప్తి చెందామని, అందరినీ వదిలేశామని తెలిపారు.