నేను టీడీపీని వీడట్లేదు..వదంతులు నమ్మొద్దు!: టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి

  • కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు
  • పార్టీని వీడాల్సిన అవసరం లేదు
  • సీఎం చంద్రబాబును కలిశా.. ఇదే విషయం చెప్పా
తాను పార్టీని వీడనున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని, ఆ వదంతులు నమ్మొద్దని కడప జిల్లా రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి అన్నారు. కొందరు కావాలనే తనపై ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఈ వదంతుల నేపథ్యంలో సీఎం చంద్రబాబు నుంచి మల్లికార్జునరెడ్డికి ఫోన్ కాల్ వెళ్లింది. దీంతో, మల్లికార్జునరెడ్డి, కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి, ఇతర నేతలు ఈ రోజు చంద్రబాబును కలిశారు.

అనంతరం మల్లికార్జునరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, టీడీపీలోనే కొనసాగుతానని చంద్రబాబుకు చెప్పానని అన్నారు. టీడీపీ నుంచి తాను వెళ్లిపోవడం లేదని, కొందరు కావాలని చెప్పే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చిన్నచిన్న సమస్యలు ఉన్నంత మాత్రాన పార్టీని వీడాల్సిన అవసరం లేదని చెప్పారు. 
Go Back to Shorts
Chandrababu
meda mallikarjuna reddy

More Telugu News