avanthi srinivas: లోక్ సభలో కాపు రిజర్వేషన్లను లేవనెత్తిన టీడీపీ ఎంపీ అవంతి

షార్ట్స్‌లో చూడండి
ప్రస్తుతం ఏపీని కాపు రిజర్వేషన్ల అంశం కుదిపేస్తోంది. కాపు రిజర్వేషన్లపై జగన్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు, లోక్ సభలో కాపు రిజర్వేషన్ల అంశాన్ని టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ లేవనెత్తారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలంటూ ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ... కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. తమిళనాడు తరహాలో రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాపు రిజర్వేషన్ల అంశాన్ని తక్షణమే షెడ్యూల్ 9లో చేర్చాలని పట్టుబట్టారు. అవంతి శ్రీనివాస్ డిమాండ్ కు పలు పార్టీలు మద్దతు పలకడం గమనార్హం.
Go Back to Shorts
avanthi srinivas
kapu
reservations
Lok Sabha

More Telugu News