Uttar Pradesh: అత్యాచారం చేసి, తన డ్రైవర్ తో యువతి పెళ్లి చేయించిన బీజేపీ నేత!

షార్ట్స్‌లో చూడండి
ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో దారుణం చోటుచేసుకుంది. అధికార బీజేపీకి చెందిన మీరట్ నేత విక్కీ తనేజా, తన డ్రైవర్ జైబ్ తో కలసి ఓ మహిళను రేప్ చేసి, కేసు నుంచి తప్పించుకునేందుకు ఆ మహిళకు డ్రైవర్ తో బలవంతంగా వివాహం జరిపించాడు. పోలీసు వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం, అత్యాచారం తరువాత మహిళ పోలీసులను ఆశ్రయించడంతో, జైబ్ తో ఆమెకు ఇష్టం లేని పెళ్లిని చేయించాడు.

అయితే వివాహం అనంతరం ఆరు నెలల పాటు బాధితురాలితో ఉన్న జైబ్, ఆపై ఆమెను వదిలేసి వెళ్లాడు. దీంతో ఆమె మరోసారి పోలీసులను ఆశ్రయించగా, విక్కీ తనేజా, జైబ్ లపై కేసు నమోదైంది. కేసును విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా, ఈ ప్రాంతంలోనే బీజేపీ ఎమ్మెల్యే కుల్ దీప్ సెంగార్, రేప్ కేసులో చిక్కుకుని జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Uttar Pradesh
Merut
BJP
Rape

More Telugu News