Pawan Kalyan: ఉజ్జయిని మహంకాళిని దర్శించుకున్న పవన్ కల్యాణ్

షార్ట్స్‌లో చూడండి
లష్కర్ బోనాలు సందర్భంగా సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. అమ్మవారికి పట్టువస్త్రాలు, పసుపుకుంకుమలను పవన్ సమర్పించారు. ఈ సందర్భంగా పవన్ ప్రత్యేకపూజలు నిర్వహించారు. జనసేనానికి శాలువా కప్పి ఆలయాధికారులు సన్మానించారు. కాగా, పవన్ కల్యాణ్ ని చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపారు. అంతకుముందు, తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. 
Go Back to Shorts
Pawan Kalyan
mahamkali

More Telugu News