చుక్కేసిన ఐటీ ఉద్యోగినులు... మహిళా పోలీసులు ఏరంటూ చుక్కలు చూపించారు!
- హైదరాబాద్ లో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు
- వేర్వేరు వాహనాల్లో వచ్చిన ఐదుగురు అమ్మాయిలు
- ఒకరికి ఒకరు తోడై పోలీసులతో వాగ్వాదం
- అందరూ తాగి పట్టుబడటంతో కేసులు నమోదు
వేర్వేరు వాహనాల్లో వచ్చిన ఐదుగురూ ఒకరికి ఒకరు తోడై, మహిళా పోలీసులు లేకుండా అమ్మాయిలకు శ్వాస పరీక్షలు ఎలా చేస్తారంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో చేసేదేమీ లేక, ఉన్నతాధికారులకు చెప్పి, అప్పటికప్పుడు మహిళా పోలీసులను స్పాట్ కు పిలిపించిన పోలీసులు వారికి తనిఖీలు చేశారు. అందరూ మద్యం తాగినట్టు తేలింది. వారందరిపైనా కేసులు నమోదు చేసిన పోలీసులు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీరికి కౌన్సెలింగ్ నిర్వహించి కోర్టు ముందు హాజరు పరుస్తామని పోలీసు అధికారి ఒకరు చెప్పారు. మొత్తం 62 కార్లు, 64 ద్విచక్ర వాహనాలు పట్టుబడ్డాయని అన్నారు.