టీఎస్ అసెంబ్లీ స్పీకర్ కు కూడా సమన్లు జారీ చేస్తాం: హైకోర్టు
- ఎమ్మెల్యేలను శాసనసభలోకి ఎందుకు అనుమతించడం లేదు?
- మా ఆదేశాలను పాటించాల్సిందే
- కోమటిరెడ్డి, సంపత్ ల బహిష్కరణపై హైకోర్టు సీరియస్
ఎమ్మెల్యేలను శాసనసభలోకి ఎందుకు అనుమతించలేదని రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ)ను హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం తరపున వాదనలను వినిపిస్తున్న ఏజీ రామచంద్రరావుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు ప్రభుత్వం తరపున వాదిస్తున్నారా? లేక, రాజకీయ పార్టీ తరపున వాదిస్తున్నారా? అంటూ ప్రశ్నించింది. తదుపరి విచారణను వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేసింది.