k.viswanath: కళాతపస్వి కె.విశ్వనాథ్ పై ‘బయోపిక్’

షార్ట్స్‌లో చూడండి
తెలుగులో ఎన్నో ఉత్తమ చిత్రాలను అందించిన దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్. తన కెరీర్ లో ఎన్నో అవార్డులు, సన్మానాలు, బిరుదులు పొందిన విశ్వనాథ్ పై ఓ బయోపిక్ తెరకెక్కనుంది. ఈ బయోపిక్ కు ‘విశ్వదర్శనం’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. దీనికి ప్రముఖ రచయిత జనార్దన మహర్షి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కె.విశ్వనాథ్, తనికెళ్ల భరణి తదితరులు పాల్గొన్నారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించనున్న ఈ బయోపిక్ లో విశ్వనాథ్ పాత్రను ఎవరు పోషిస్తారనేది అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. కాగా,1965లో వచ్చిన 'ఆత్మగౌరవం' చిత్రానికి విశ్వనాథ్ తొలిసారిగా దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ప్రైవేట్ మాస్టర్, కలిసొచ్చిన అదృష్టం, ఉండమ్మా బొట్టుపెడతా, నిండు హృదయాలు, చెల్లెలికాపురం.... సిరిసిరిమువ్వ, శంకరాభరణం, శుభోదయం, సప్తపది, శుభలేఖ, సాగరసంగమం, స్వాతికిరణం వంటి ఆణిముత్యాల్లాంటి చిత్రాలకు విశ్వనాథ్ దర్శకత్వం వహించారు.
Go Back to Shorts
k.viswanath
biopic

More Telugu News