allu arjun: బన్నీ ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేశాడా?

షార్ట్స్‌లో చూడండి
ఎంతో నమ్మకం పెట్టుకుని అల్లు అర్జున్ చేసిన 'నా పేరు సూర్య' ఆశించిన స్థాయిలో ఆడలేదు .. దాంతో బన్నీ కొంత నిరాశకి లోనయ్యాడు. ఆయన తదుపరి చిత్రం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వుండనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన కథపై విక్రమ్ కుమార్ కసరత్తు చేస్తున్నాడనీ, సెకండాఫ్ విషయంలోనే బన్నీ మార్పులు .. చేర్పులు చెప్పాడనే టాక్ వినిపించింది.

అయితే, ఈ ప్రాజెక్టును పూర్తిగా పక్కన పెట్టేశారనేది తాజా సమాచారం. ఏం జరిగిందనేది తెలియదు గానీ .. బన్నీ ఈ ప్రాజెక్టును గురించి ఎక్కడా మాట్లాడటం లేదు. విక్రమ్ కుమార్ మరో కథను రెడీ చేసుకుంటున్నాడట. అది బన్నీ కోసమో .. కాదో తెలియదు. త్రివిక్రమ్ తో చేయాలని బన్నీ అనుకుంటున్నప్పటికీ అది ఇప్పట్లో అయ్యే పనికాదు. అందువలన ఒక యువ దర్శకుడితో ముందుకు వెళ్లాలనే ఆలోచనలో బన్నీ వున్నాడని అంటున్నారు.   
Go Back to Shorts
allu arjun

More Telugu News