అవసరమైతే మూకదాడుల నివారణకు ప్రత్యేక చట్టం: రాజ్ నాథ్ సింగ్
- పార్లమెంటుకు తెలిపిన కేంద్ర హోంమత్రి రాజ్ నాథ్
- దాడుల నియంత్రణపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని వెల్లడి
- నిర్లక్ష్యం వహించే అధికారులపై వేటు తప్పదని హెచ్చరిక
నిర్లక్ష్యం వహిస్తే వేటే..
దేశంలో మూకహత్యల నివారణకు కేంద్ర హోంశాఖ అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలను విడుదల చేసింది. మూకదాడులు, అల్లర్లు జరిగిన సందర్భాల్లో విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హోంశాఖ హెచ్చరించింది. మూకహత్యలపై వదంతుల్ని నివారించడానికి ప్రతి జిల్లాకు ఓ ఎస్పీ స్థాయి అధికారిని నియమించాలనీ, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటుచేయడంతో పాటు సోషల్ మీడియాపై నిఘాను కట్టుదిట్టం చేయాలని సూచించింది. దేశంలో మూకహత్యల నియంత్రణకు ప్రత్యేకంగా చట్టం చేయాలని ఇటీవల కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.