కొత్త ఫ్లాట్ కొనుగోలు చేసిన బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్.. ధర కోట్లలోనే!
- వర్లీలో ఖరీదైన ఓ డూప్లెక్స్ ఫ్లాట్
- 8,625 చదరపు అడుగుల విస్తీర్ణం
- దీని ఖరీదు రూ.55.60 కోట్లు?
ఈ క్రమంలో ముంబైలోని వర్లీలో ఖరీదైన ఓ డూప్లెక్స్ ఫ్లాట్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. దీని ఖరీదు రూ.55.60 కోట్లు ఉంటుందని బాలీవుడ్ వర్గాల సమాచారం. షాహిద్ పంకజ్ కపూర్, మీరా పేర్లతో దీని రిజిస్ట్రేషన్ జరిగిందట. రిజిస్ట్రేషన్ నిమిత్తం ఇప్పటికే రూ.2.19 కోట్లు చెల్లించినట్టు తెలుస్తోంది. 8,625 చదరపు అడుగులున్న ఈ కొత్త ఫ్లాట్ 42వ అంతస్తులో ఉందట.