Jagan: ఇప్పుడు కూడా మన రాష్ట్రమే ఇబ్బంది పడాలా?: రామ్మోహన్ నాయుడు

షార్ట్స్‌లో చూడండి
ఏపీలో రేపు వైసీపీ బంద్ తలపెట్టడంపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శలు గుప్పించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఏపీ ప్రయోజనాలపై వైసీపీకి చిత్తశుద్ధిలేదని అన్నారు. కేంద్రాన్ని నిలదీస్తూ ఢిల్లీలో నిరసన తెలపాల్సిన వైసీపీ, ఇప్పుడు కూడా మన రాష్ట్రమే ఇబ్బంది పడేలా బంద్ కు పిలుపు నివ్వడం తగదని అన్నారు.

కేవలం, చంద్రబాబును ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలన్నదే వైసీపీ లక్ష్యమని మండిపడ్డారు. ఏపీ ప్రజలంతా కేంద్రంపై పోరాడుతుంటే, వైసీపీ ఎంపీలు వెళ్లి ప్రధాని కార్యాలయంలో కూర్చుంటారని విమర్శించారు. టీడీపీ అవిశ్వాసం పెట్టడంతో వైసీపీ డిఫెన్స్ లో పడిందని, టీడీపీ ఎంపీల రాజీనామా డిమాండ్ కోసం వైసీపీ బంద్ పిలుపు నివ్వడం విడ్డూరంగా ఉందని అన్నారు. మోదీకి సహకరించాలన్న ఉద్దేశంతో వైసీపీ పనిచేస్తోందని దుయ్యబట్టారు.
Go Back to Shorts
Jagan
ram mohan naidu

More Telugu News