వృద్ధుడికి నోటి ద్వారా శ్వాస అందించి.. ప్రాణాలు కాపాడిన యువతి!
- చైనాలోని జింఝౌలో ఘటన
- రైల్వే స్టేషన్ లో స్పృహతప్పి పడిపోయిన వృద్ధుడు
- సీపీఆర్ ప్రక్రియ ద్వారా ప్రాణాలు నిలబెట్టిన యువతి
మోకాళ్లపై కూర్చొని, రెండు చేతులతో అతని ఛాతీపై పదేపదే బలంగా నొక్కింది. మరోవైపు నోటి ద్వారా అతనికి శ్వాసను అందించింది. కాసేపటికి ఆయన గుండె మళ్లీ కొట్టుకోవడం ప్రారంభించింది. దాంతో ఆయనను లేపి కూర్చోబెట్టారు. ఎంతో సమయస్పూర్తితో వ్యవహరించిన ఆ యువతిని జింఝౌ మెడికల్ కాలేజీ విద్యార్థిని డింగ్ హుయ్ గా గుర్తించారు. ఆమె చేసిన గొప్ప పనికి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి.