లతా మంగేష్కర్ తో అమిత్ షా సుదీర్ఘ భేటీ!
- లతకు బీజేపీ విజయాలను వివరించిన అమిత్ షా
- ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేయాలని విన్నపం
- భేటీలో పాల్గొన్న మహా సీఎం దేవేంద్ర ఫడ్నవిస్
ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేయాలని కోరారు. నాలుగేళ్ల కాలంలో బీజేపీ సాధించిన విజయాలను ఈ సందర్భంగా అమిత్ షా ఆమెకు తెలిపారు. బీజేపీ విజయాల గురించి ఉన్న పుస్తకాన్ని ఆమెకు బహూకరించారు. ఈ భేటీలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, బీజేపీ రాష్ట్ర చీఫ్ రాసా సాహెబ్, మరోనేత అశీష్ షెల్లర్ లు కూడా పాల్గొన్నారు. వాస్తవానికి జూన్ 6నే లతా మంగేష్కర్ తో అమిత్ షా భేటీ కావాల్సి ఉంది. కానీ, ఆ సమయంలో ఆమె ఫుడ్ పాయిజన్ తో బాధపడుతుండటం వల్ల వీరి భేటీ జరగలేదు.