RX 100: తను నా జీవితంలోకి వచ్చాడు... నాన్ వెజ్ వదిలేశాను: 'ఆర్ఎక్స్ 100' హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్

షార్ట్స్‌లో చూడండి
లేటెస్ట్ హాట్ హిట్ 'ఆర్ఎక్స్ 100'తో రాత్రికి రాత్రే టాలీవుడ్ లో స్టార్ అయిపోయిన పాయల్ రాజ్ పుత్ కొంతకాలంగా నాన్ వెజ్ తినడం మానేసిందట. తన కొత్త సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, తన జీవితంలోకి ఓ వ్యక్తి వచ్చాడని, అతను వచ్చిన తరువాత తనలో ఆధ్యాత్మికత పెరిగిందని, నా కోసం ఇంకో ప్రాణాన్ని చంపడం అవసరమా? అన్న ఆలోచన వచ్చిన తరువాత మాంసాహారం మానేశానని చెప్పింది.

ఇక ఆ 'తను' ఎవరన్న విషయాన్ని మాత్రం ఇప్పుడు చెప్పబోనని తెగేసి చెప్పిందీ పంజాబీ భామ. నటనపై ఫోకస్ చేస్తున్నానని, టాలీవుడ్ లో మహేష్ బాబు పక్కన నటించాలని ఉందని చెప్పింది. తెలుగులోనే సెటిలైపోవాలన్న ఆలోచనతో ఉన్నానని, అక్టోబర్ లో కొత్త ప్రాజెక్టు ఉంటుందని అంది. ఇక్కడి అమ్మాయిలు చాలా సింపుల్ గా ఉంటారని, తమ ప్రాంతంలో ఇలాంటి వాళ్లను చూడలేమని చెప్పింది.

'ఆర్ఎక్స్ 100'లో హాట్ కిస్ సీన్స్ గురించి ప్రస్తావిస్తూ, తొలుత ముద్దు దృశ్యాలకు భయపడ్డానని, అయితే, హీరో కార్తికేయ చాలా ప్రొఫెషనల్ కావడంతో, తాను సౌకర్యంగా ఫీల్ అయ్యానని, తమ మధ్య సన్నివేశాలు కేవలం నటన మాత్రమేనని, 'యాక్షన్' చెప్పగానే నటనలోకి వెళ్లిపోయే తాము 'కట్' చెప్పగానే బయటకు వచ్చి ఎవరిదారిన వాళ్లం వెళ్లిపోయేవారమని పాయల్ చెప్పింది. రెండు మూడు యాంగిల్స్ లో సీన్ రావడం కోసం కిస్ సీన్లను రిపీట్ చేశామే తప్ప, వన్ మోర్ షాట్ అన్న మాటే దర్శకుడి నుంచి రాలేదని అంటోందీ ముద్దుగుమ్మ.
Go Back to Shorts
RX 100
Payal Rajput
Hot Scenes
Kiss Seen
Lip Lock

More Telugu News