rape: 120 మంది మహిళలపై అత్యాచారం చేసిన పూజారి.. అరెస్ట్

షార్ట్స్‌లో చూడండి
120 మంది మహిళలను రేప్ చేసి, ఆ దృశ్యాలను వీడియో తీసిన ఓ పూజరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే, హర్యాణా ఫతేహాబాద్ లోని బాబా బాలక్ నాథ్ ఆలయంలో బాబా ఆమ్రపురి అనే వ్యక్తి పూజారిగా ఉన్నాడు. అతను మహిళలపై రేప్ చేసిన కొన్ని వీడియోలు ఆన్ లైన్ లో ప్రత్యక్షం కావడంతో... అతని బండారం బట్టబయలైంది. కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం అతని నివాసంలో సోదాలు నిర్వహించిన పోలీసులు పలు అనుమానాస్పద వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కనీసం 120 మందిని రేప్ చేసిన వీడియోలు సోదాల్లో లభించాయి. ఈ వీడియోలన్నీ కూడా వివిధ మహిళలకు చెందినవి. ఈ వీడియోలను చూపిస్తూ, బ్లాక్ మెయిల్ చేస్తూ, వారిపై తన అత్యాచారాలను కొనసాగించాడని పోలీసులు తెలిపారు. మరోవైపు, ఈ కామాంధుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Go Back to Shorts
rape
haryana

More Telugu News