బాంబులు జారవిడిచిన కోతి.. ముగ్గురికి తీవ్ర గాయాలు!

  • పాలిథిన్ సంచిని జారవిడిచిన కోతులు
  • పెద్ద శబ్దంతో పేలిన బాంబులు
  • ఆసుపత్రిలో కోలుకుంటున్న బాధితులు
అవును! కోతి బాంబులు విసరడంతో ఒక చిన్నారి సహా ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌లో జరిగిందీ ఘటన. బాంబులున్న సంచిని కోతులు ఎత్తుకెళ్తుండగా అది కిందపడింది. దీంతో బాంబులు పేలినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఆ గ్రామానికి చెందిన గులాబ్ గుప్తా (60) స్కూలుకు వెళ్లిన మనవడు వచ్చే వేళ కావడంతో ఐదేళ్ల తన మనవడితో కలిసి ఇంటి బయట వేచి చూస్తున్నాడు. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న కోతులు నోటితో పట్టుకున్న పాలిథిన్ సంచిని వారిపై జారవిడిచాయి. అంతే, పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. దీంతో తాతామనవళ్లతో పాటు అటుగా వెళుతున్న ఓ వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు.

కోతులు బహుశా చెత్త డంపింగ్ యార్డ్ నుంచి ఆ సంచిని తీసుకొచ్చి ఉండవచ్చని పోలీసులు తెలిపారు. సంచితో ఇంటిపైన అవి గెంతుతుండగా పొరపాటున అది కిందపడి పేలుడు సంభవించి ఉండొచ్చని పేర్కొన్నారు. బాధితులకు ప్రాణాపాయం లేదని, కోలుకోవడానికి మరికొన్ని రోజులు పడుతుందని చెప్పారు.
Go Back to Shorts
Monkey
Uttar Pradesh
crude bombs

More Telugu News