చండీగఢ్ లో దారుణాతి దారుణం... 22 ఏళ్ల యువతిపై 40 మంది అత్యాచారం!
- సభ్యసమాజం తలదించుకునే ఘటన
- హర్యానాలోని పంచకుల జిల్లాలో సామూహిక అత్యాచారం
- ఉద్యోగమిప్పిస్తానని తీసుకెళ్లి దుర్మార్గం
బాధితురాలి భర్త పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం, తనకు తెలిసిన వ్యక్తి ఒకరు ఉద్యోగమిప్పిస్తానని చెప్పి, తన భార్యను గెస్ట్ హౌస్ కు రమ్మని పిలిచాడు. అతను చెప్పిన మాటలు నమ్మిన బాధితురాలు అక్కడికి వెళ్లింది. ఈ నెల 15వ తేదీ ఆదివారం నాడు వెళ్లిన ఆమె, బుధవారం 18 వరకూ తిరిగి రాలేదు. ఆమెను నాలుగు రోజుల పాటు అక్కడే బంధించారు. మత్తుమందులు ఇచ్చి చిత్రహింసలు పెట్టారు. రోజుకు 10 మంది ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అక్కడి నుంచి బయటపడిన ఆమె, భర్తకు ఫోన్ చేసి, అతని సాయంతో ఇల్లు చేరి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.