మోదీ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ క్షమించరు: లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీ వినోద్
- ఏడు మండలాలను ఏపీలో కలిపేశారు
- తొలి కేబినెట్ సమావేశంలోనే మోదీ కేబినెట్ ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది
- ఆ ఏడు మండలాలను మళ్లీ తెలంగాణలో కలపాలి
ఈ ఏడు మండలాలను మళ్లీ తెలంగాణలో కలిపేందుకు, పార్లమెంటులో అమెండ్ మెంట్ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ మండలాలను ఏపీలో కలపడం వల్ల సీలేరు పవర్ ప్రాజెక్టు ఏపీకి వెళ్లిపోయిందని చెప్పారు. తెలంగాణకు ఉన్న కరెంటు కష్టాలను ఇది మరింత పెంచిందని అన్నారు. అయితే పక్క రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపిన ముఖ్యమంత్రి కేసీఆర్... రాష్ట్రానికి విద్యుత్ కష్టాలు లేకుండా చేశారని చెప్పారు. ఇప్పుడు తెలంగాణలోని రైతులకు 24 గంటల పాటు ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని తెలిపారు.