rajanikanth: రాత్రివేళలో డాన్ గా మారిపోయే రజనీ!

షార్ట్స్‌లో చూడండి
రజనీకాంత్ ను తెరపై డాన్ గా చూడాలని ఆయన అభిమానులు ముచ్చటపడుతుంటారు. గతంలో వచ్చిన 'బాషా' సినిమా .. అది సృష్టించిన సంచలనం అందుకు కారణం. అభిమానుల కోసమే రజనీ ఇటీవల 'కబాలి' సినిమాలో డాన్ గా కనిపించారు. .. ఆ తరువాత 'కాలా' సినిమాలోను డాన్ గానే అదరగొట్టేశారు. ఈ సినిమాల సక్సెస్ సంగతి అటుంచితే కొత్త గెటప్స్ లో రజనీని చూసిన అభిమానులు సంతోషంతో పొంగిపోయారు.

 ఈ నేపథ్యంలోనే రజనీకాంత్ .. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమాలోను రజనీ డాన్ గా కనిపించనున్నాడు. అలాగని చెప్పేసి ఇది రొటీన్ గా అనిపించే డాన్ పాత్ర కాదట. ఈ సినిమాలో రజనీ ఉదయం నుంచి రాత్రి వరకూ హాస్టల్ వార్డెన్ గా కనిపిస్తారట. ఆ తరువాత నుంచి డాన్ గా మారిపోతాడని అంటున్నారు. రాత్రివేళ డాన్ గా మారిపోయిన రజనీ ఏం చేస్తాడనే ఆసక్తికరమైన మలుపులతోనే కథ కొనసాగుతుందని చెబుతున్నారు. ఈ సినిమాలో రజనీ సరసన సిమ్రాన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.      
Go Back to Shorts
rajanikanth

More Telugu News