parliament: లోక్ సభలో గందరగోళం.. నినాదాలతో హోరెత్తిస్తున్న విపక్ష సభ్యులు

  • విభజన హామీల గురించి ఆందోళన చేస్తున్న టీడీపీ
  • వివిధ అంశాలపై నినాదాలు చేస్తున్న విపక్ష సభ్యులు
  • ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ సుమిత్ర మహాజన్

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు గందరగోళం మధ్య ప్రారంభమయ్యాయి. గందరగోళం మధ్యే లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఏపీ విభజన హామీలను నెరవేర్చాలంటూ టీడీపీ ఎంపీలు నినాదాలు చేస్తున్నారు. మరోపక్క, తమతమ సమస్యల గురించి ఇతర విపక్ష సభ్యులు కూడా నినాదాలతో హోరెత్తిస్తున్నారు. సభను అడ్డుకుంటున్న విపక్ష సభ్యులపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ విపక్ష సభ్యులు వెనక్కి తగ్గడం లేదు. ఈ సమావేశాల్లో మొత్తం 46 బిల్లులు చర్చకు రానున్నాయి. ఇందులో మహిళా రిజర్వేషన్లు, ట్రిపుల్ తలాక్ బిల్లులు కూడా ఉన్నాయి. 

More Telugu News