ఇక పతంజలి కూరగాయలు.. సిద్ధమవుతున్న రాందేవ్ బాబా
- త్వరలో కూరగాయల వ్యాపారంలోకి పతంజలి
- తొలి దశలో ఆరేడు కూరగాయలు
- స్వదేశ్ పేరుతో ఖాదీ ఉత్పత్తులు కూడా
తొలి దశలో క్యారెట్, కాలీఫ్లవర్ వంటి ఆరేడు కూరగాయలతో మార్కెట్లోకి రావాలని పతంజలి నిర్ణయించింది. ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలోని కంపెనీ యూనిట్ల నుంచి కూరగాయలను సేకరించనుంది. ప్రస్తుతం శీతలీకరించిన పండ్లు, కూరగాయల వ్యాపారం దేశవ్యాప్తంగా రూ.1500 కోట్లకు చేరుకుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.