Pawan Kalyan: పవన్ కల్యాణ్ నమ్మదగిన వ్యక్తి కాదు: బొత్స సత్యనారాయణ

  • ప్రత్యేక హోదా కోసం అవిశ్వాసం పెడితే.. 50 మంది ఎంపీల మద్దతు కూడగడతానని చెప్పారు
  • అవిశ్వాసం పెట్టిన తర్వాత పత్తా లేకుండా పోయారు
  • 1500 రోజుల టీడీపీ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను నమ్మలేమని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. రైల్వే జోన్ కోసం ప్రజలంతా రోడ్డెక్కాల్సిన అవసరంలేదని... ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ లు విశాఖపట్నంకు వస్తే... ముగ్గురం కలసి రైలు పట్టాలపై కూర్చుని రైళ్లను ఆపుదామని... రైల్వే జోన్ ను కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వదో చూద్దామని పవన్ కల్యాణ్ చెప్పిన విషయం తెలిసిందే.

ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ బొత్స వైవిధంగా స్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడితే, దేశమంతా తిరిగి 50 మంది ఎంపీల మద్దతు కూడగడతానని పవన్ కల్యాణ్ చెప్పారని... తీరా అవిశ్వాస తీర్మానం పెట్టిన తర్వాత పత్తాలేకుండా పోయారని గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ ను నమ్మలేమని అన్నారు.

తెలుగుదేశం పార్టీ 1500 రోజుల పాలన పూర్తి చేసుకున్నప్పటికీ, ప్రజలకు ఒరిగిందేమీ లేదని బొత్స విమర్శించారు. 18 మంది ఎంపీలతో ఏమీ సాధించలేకపోయిన చంద్రబాబు... మరో 7 ఎంపీ సీట్లు ఇస్తే ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. వైయస్ పేరు ఎత్తే అర్హత కూడా చంద్రబాబుకు లేదని... వైయస్ బతికుంటే టీడీపీ ఈపాటికి భూస్థాపితం అయ్యేదని చెప్పారు. 

More Telugu News