Hindupuram: హిందూపురంలో హీరో బాలకృష్ణ ఇంటి ముందు చేనేత కార్మికుల ధర్నా!

  • చేనేత కార్మికుల రుణాల మాఫీ ఎక్కడ?
  • బాలకృష్ణను కలిసి మొరపెట్టుకున్నా ప్రయోజనం శూన్యం
  • ఆరోపించిన నేత కార్మిక సంఘాలు

హిందూపురం ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ ఇంటిముందు చేనేత కార్మికులు ధర్నా నిర్వహించారు. చేనేత కార్మికుల రుణాన్ని మాఫీ చేస్తామని హామీ ఇచ్చి, దాన్ని నిలబెట్టుకోలేదని ఆరోపిస్తూ, హిందూపురంలోని బాలయ్య ఇంటి ముందు కొందరు కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో నేత కార్మికులు ఎన్నో కష్టాలు పడుతున్నారని, వారికి రుణమాఫీ వర్తింపజేస్తామని పలుమార్లు హామీ ఇచ్చిన ప్రభుత్వం దాన్ని నెరవేర్చలేదని వారు ఆరోపించారు. ఎమ్మెల్యేను కలిసి మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయిందని ఆరోపించారు.

డబ్ల్యూసీసీ పథకం కింద ఒక్కో కార్మికుడూ రూ. 50 వేల వరకూ రుణం తీసుకున్నారని, మగ్గం పనులు లేకున్నా వడ్డీలు చెల్లించామని, 2014 ఎన్నికలకు ముందు రుణ మాఫీ చేస్తామని ప్రకటించిన టీడీపీని ఆదరిస్తే, నాలుగేళ్లయినా చేసిన అప్పులు అలాగే ఉన్నాయని వారు ఆరోపించారు. సమస్యను బాలకృష్ణ దృష్టికి తీసుకెళితే, వారం రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ఆయన, నెలలు దాటినా స్పందించలేదని చేనేత కార్మిక సంఘం నేతలు ఆరోపించారు. కాగా, వీరు ధర్మా చేసిన సమయంలో బాలయ్య అక్కడ లేరు.

More Telugu News