వాళ్లిద్దరి కారణంతోనే ఇంత భారీ ఓటమి: విరాట్ కోహ్లీ

  • ఇంగ్లండ్ తో మ్యాచ్ లో ఓడిన భారత్
  • మోయిన్ అలీ, రషీద్ లు బాగా బౌలింగ్ చేశారు
  • వారిలో ఒక్కరు విఫలమైనా ఫలితం మారుండేదన్న కోహ్లీ
నిన్న లార్డ్స్ మైదానంలో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు భారీ ఓటమికి ఇంగ్లండ్ బౌలర్లు మోయిన్ అలీ, రషీద్ లే కారణమని కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, వన్డే ఫార్మాట్ లో వారిద్దరూ నాణ్యమైన బౌలర్లని కితాబిస్తూ, తాము రిస్క్ చేయలేకపోయామని, వీరిద్దరిలో ఏ ఒక్కరు విఫలమైనా ఫలితం మరోలా ఉండేదని చెప్పాడు.

భారీ లక్ష్య ఛేదనకు దిగిన తమ జట్టు ఆరంభంలో బాగానే ఆడిందని, వరుసగా మూడు వికెట్లు పడిపోవడంతో కోలుకోలేని దెబ్బ తగిలిందని చెప్పారు. ప్రస్తుతం కొత్త ఆటగాళ్లను పరిశీలిస్తుండటం కూడా విజయావకాశాలను ప్రభావితం చేసిందని అభిప్రాయపడ్డ కోహ్లీ, శనివారం తమకు బ్యాడ్ డేగా మిగిలిపోయిందని చెప్పాడు. అలీ, రషీద్ లు పొదుపుగా బౌలింగ్ చేస్తుంటే, ఓ దశలో ఒత్తిడి పెరిగిపోయి, వికెట్లు సమర్పించుకోవాల్సి వచ్చిందని అన్నాడు. ఈ మ్యాచ్ లో భారత్ 86 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
India
England
Kohli
Moin Ali
Rashid

More Telugu News