న్యూఢిల్లీ మ్యూజియం నుంచి వస్తువును దొంగిలించిన మిలియనీర్... సీసీటీవీ దృశ్యాలు!

షార్ట్స్‌లో చూడండి
న్యూఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో ఓ విలువైన వస్తువు దొంగతనానికి గురికాగా, సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు, అధికారులు, గురుగ్రామ్ లోని ఓ మిలియనీర్ ఈ పని చేశాడని గుర్తించారు. పురాతన కాలానికి చెందిన రాతి చేతి గొడ్డలి జూన్ 24న కనిపించకుండా పోయింది. మ్యూజియం అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించిన అధికారులు ఓ వ్యక్తి దాన్ని దొంగిలించినట్టు గుర్తించారు.

సదరు వ్యక్తి గురుగ్రాంకు చెందిన 53 ఏళ్ల మిలియనీర్ ఉదయ్ రాత్ర అని గుర్తించిన పోలీసులు, శుక్రవారం రాత్రి ఆయన ఇంటిపై దాడి చేశారు. అతని నుంచి ఆ రాయిని స్వాధీనం చేసుకున్నామని, పెద్దగా ప్రతిఘటన లేకుండానే ఆయన లొంగిపోయాడని ఐపీఎస్ అధికారి మధుర్ వర్మ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడిస్తూ, సీసీటీవీ ఫుటేజ్ ని జతచేశారు. ఈ రాతి గొడ్డలి 15 లక్షల సంవత్సరాల క్రితం ఆత్మరక్షణకు వాడినదని ఆయన తెలిపారు. కాగా, ఉదయ్ రాత్ర గతంలోనూ నేర చరిత్రను కలిగివున్నాడని, 20 ఏళ్ల పాటు యూకేలో ఉన్న ఆయన్ను 2006లో డిపోర్ట్ చేశారని, ఆపై 2016లో ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో యూఎస్ విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ బస చేసిన వేళ, బ్లేడుతో లోపలికి ప్రవేశించబోయి అరెస్టయ్యారని పోలీసు అధికారులు వెల్లడించారు.
Go Back to Shorts
New Delhi
Musium
Handaxe
Theft
Missing
CCTV

More Telugu News