సమయస్ఫూర్తితో వ్యవహరించి.. అగ్ని ప్రమాదాన్ని తప్పించిన చైనా యువతి.. వీడియో వైరల్
- పెట్రోల్ బంకులో పని చేస్తోన్న యువతి
- త్రిచక్రవాహనానికి అంటుకున్న మంటలు
- 12 సెకన్లలో అదుపు చేసిన యువతి
త్రిచక్ర వాహనానికి మంటలు అంటుకున్న నేపథ్యంలో అందరూ పరుగులు తీస్తుండగా ఆ యువతి మాత్రం ఎంతో ధైర్యంగా వ్యవహరించడం పట్ల ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. మంటలను కేవలం 12 సెకన్లలో ఆమె అదుపు చేసింది. చైనాలోని జియాంగ్జిలో ఈ ఘటన చోటు చేసుకుంది.