మెగా హీరో మూవీ రిలీజ్ డేట్ ఖరారు

- సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్
- నాయికలుగా లావణ్య త్రిపాఠి .. అదితీ రావు
- ప్రధానబలంగా సాంకేతిక పరిజ్ఞానం
రాజీవ్ రెడ్డి .. సాయిబాబు నిర్మాతలుగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకి తాజాగా విడుదల తేదీని ఖరారు చేశారు. డిసెంబర్ 21వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. హాలీవుడ్ మూవీ కి స్టంట్ మాస్టర్స్ గా పనిచేసినవాళ్లు ఈ సినిమాకి పనిచేశారు. ఇక అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ సినిమా కోసం వినియోగిస్తున్నారు. అందువలన యాక్షన్ ఎపిసోడ్స్ .. టెక్నాలజీ ఈ సినిమాకి ప్రధానబలంగా నిలవనున్నాయని చెబుతున్నారు. 'ఘాజీ' హిట్ తరువాత సంకల్ప్ రెడ్డి చేస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.