నితీష్ తో కలసి.. ఫుల్ స్వీప్ చేస్తాం: అమిత్ షా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నితీష్ తో కలసి.. ఫుల్ స్వీప్ చేస్తాం: అమిత్ షా

  • పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ, జేడీయూలు కలిసి పోటీ చేస్తాయి
  • రాష్ట్రంలో ఉన్న 40 స్థానాలనూ కైవసం చేసుకుంటాం
  • ఇరు పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు లేవు
బీహార్ లో నితీష్ కుమార్ పార్టీ జేడీయూతో కలసి పోటీ చేస్తామని... మొత్తం 40 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుంటామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పారు. ఈ ఉదయం నితీష్ కుమార్ తో కలిసి బ్రేక్ ఫాస్ట్ సమావేశంలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ రాత్రికి విందు సమావేశం కూడా ఉంది. ఈ మధ్యలో తమ పార్టీ నేతలతో అమిత్ షా భేటీ అయ్యారు.

 రానున్న పార్లమెంటు ఎన్నికల్లో జేడీయూతో కలసే పోటీ చేయబోతున్నామని పార్టీ శ్రేణులకు అమిత్ షా స్పష్టం చేశారు. ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకాల విషయంలో విభేదాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోందని... వాస్తవానికి అలాంటిదేమీ లేదని చెప్పారు. విపక్షాలు ఎలా ప్రచారం చేసుకున్నా తాము పట్టించుకోబోమని... అన్ని స్థానాల్లో ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 
amit shah
nitish kumar
jdu
bjp
alliance

More Telugu News