anupama parameshwaran: నాకేం కాలేదు .. నేను బాగానే వున్నాను!: 'ఆసుపత్రిలో చేరిక'పై అనుపమ పరమేశ్వరన్

షార్ట్స్‌లో చూడండి
'హలో గురూ ప్రేమ కోసమే' సినిమా షూటింగులో అనుపమ పరమేశ్వరన్ హఠాత్తుగా పడిపోయిందనీ .. ఆమెను హాస్పిటల్లో చేర్పించారనే వార్తలు వచ్చాయి. సెట్లో ప్రకాశ్ రాజ్ తో గొడవపడిన ఆమె బాగా ఏడ్చేసి అలా కుప్పకూలిపోయిందనే టాక్ బలంగా వినిపించింది. ఆమె తీవ్రమైన అనారోగ్యానికి లోనైందనే ప్రచారం ఉపందుకుంది. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని గురించి అనుపమ స్పందించింది.

"హలో గురు ప్రేమకోసమే' సినిమాకి సంబంధించి నాకు .. ప్రకాశ్ రాజ్ కి మధ్య ఒక సీన్ ను చిత్రీకరిస్తున్నారు. జ్వరం .. లోబీపీ కారణంగా నేను అస్వస్థతకి లోనయ్యాను. దాంతో టైమింగ్ లో డైలాగ్ చెప్పలేక ఇబ్బంది పడ్డాను. నా పరిస్థితిని గ్రహించిన యూనిట్ సభ్యులు వెంటనే హాస్పిటల్లో చేర్పించారు. డాక్టర్స్ ఇచ్చిన మందులు వాడిన తరువాత ఇప్పుడు బాగానే వుంది. ఇంత చిన్న విషయంపై ఇన్ని పుకార్లు రావడం చూసి నాకు నవ్వొస్తోంది. నాకేమీ కాలేదు .. నేను బాగానే వున్నాను .. అభిమానులు కంగారుపడవలసిన పనిలేదు" అని ఆమె స్పష్టం చేసింది.   
Go Back to Shorts
anupama parameshwaran

More Telugu News