election: జమిలి ఎన్నికలపై ముగిసిన అభిప్రాయ సేకరణ.. ఏయే పార్టీలు ఏం చెప్పాయంటే..!

  • పార్టీల నుంచి మిశ్రమ స్పందన 
  • ఓకే చెప్పిన టీఆర్‌ఎస్‌.. కండిషన్‌ పెట్టిన టీడీపీ
  • జమిలి ఎన్నికలకు అన్నాడీఎంకే, అకాలీదళ్‌ అనుకూలం
  • టీఎంసీ, సీపీఐ, గోవా పార్వర్డ్‌ పార్టీ, డీఎంకే విముఖత

దేశంలో లోక్‌సభ, శాసనసభల ఎన్నికలు (జమిలి) ఒకేసారి నిర్వహించాలా? వద్దా? అనే విషయంపై రాజకీయ పార్టీల నుంచి లా కమిషన్‌ నిన్నటి నుంచి తీసుకుంటోన్న అభిప్రాయ సేకరణ ముగిసింది. పలు పార్టీలు ఇందుకు ఒప్పుకోగా, మరికొన్ని ససేమిరా అన్నాయి. జమిలి ఎన్నికలకు తెలంగాణ అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఒప్పుకోగా, ఆంధ్రప్రదేశ్‌ అధికార పార్టీ టీడీపీ 2019లో వచ్చే సాధారణ ఎన్నికల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే తమకు అభ్యంతరం లేదని తెలిపిన విషయం తెలిసిందే. ఈ నెల 10న తమ అభిప్రాయం చెబుతామని వైసీపీ తెలిపింది.

ఇక, అన్నాడీఎంకే, అకాలీదళ్‌ పార్టీలు జమిలి ఎన్నికలకు అనుకూలంగా అభిప్రాయం తెలపగా, టీఎంసీ, సీపీఐ, గోవా పార్వర్డ్‌ పార్టీ, డీఎంకే పార్టీలు విముఖత తెలిపాయి. అలాగే, విపక్షాలతో చర్చించాక ఈ విషయంపై తమ నిర్ణయం చెబుతామని కాంగ్రెస్‌ పార్టీ చెప్పింది. అయితే, ఈ విషయంపై తాము ఓ నిర్ణయం తీసుకునేందుకు ఈ నెలాఖరు వరకు సమయం కావాలని బీజేపీ కోరింది.     

More Telugu News