Telugudesam: జమిలి ఎన్నికలపై అభిప్రాయం తెలిపిన టీడీపీ!

షార్ట్స్‌లో చూడండి
రాష్ట్ర ప్రభుత్వాలపై పెత్తనం చలాయించేందుకే జమిలి ఎన్నికలను తీసుకొస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌ ఎంపీలు అన్నారు. ఈరోజు లా కమిషన్‌కు తమ అభిప్రాయాన్ని చెప్పడానికి ఢిల్లీకి వెళ్లిన టీడీపీ ఎంపీలు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రాల హక్కులను హరించేలా ఉంటే జమిలి ఎన్నికలకు టీడీపీ వ్యతిరేకమని అన్నారు.

2019లో వచ్చే సాధారణ ఎన్నికల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే తమకు అభ్యంతరం లేదని టీడీపీ ఎంపీలు అన్నారు. జమిలి ఎన్నికలు అమలు చేస్తే.. ఒకవేళ ఏ కారణంతో అయినా రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోతే మిగిలిన కాలానికే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని, అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ఏపీలో టీడీపీ సర్కారు ఐదేళ్లూ పాలన పూర్తి చేస్తుందని చెప్పారు.
Go Back to Shorts
Telugudesam
mps
New Delhi

More Telugu News