Police: వారానికి లక్ష రూపాయల బేరంతో హీరోయిన్ ను తెచ్చా: పోలీసుల విచారణలో జనార్దన్

షార్ట్స్‌లో చూడండి
వారం రోజుల పాటు హోటల్ గదిలో ఉండి వ్యభిచారం చేసేందుకు లక్ష రూపాయలు ఇచ్చే ఒప్పందంపై ముంబై నటి దీక్షా కుష్వాను హైదరాబాద్ కు తీసుకు వచ్చినట్టు అంబుల జనార్దన్ రావు పోలీసుల విచారణలో తెలిపాడు. రాడిసన్ హోటల్ లో సాగుతున్న ఈ దందాను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బట్టబయలు చేసిన సంగతి తెలిసిందే. పట్టుబడిన జనార్దన్ ను పోలీసులు విచారించగా, గతంలో తాను పలువురు మహిళా నటులను హైదరాబాద్ కు రప్పించినట్టు అంగీకరించాడని తెలుస్తోంది.

తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురానికి చెందిన అతను, చానాళ్ల క్రితమే హైదరాబాద్ కు వచ్చి పద్మారావు నగర్ లో నివాసం ఉంటున్నాడు. కొంతకాలంగా వ్యభిచార దందా నిర్వహిస్తున్నాడు. గతంలో బంజారాహిల్స్, పంజాగుట్ట పోలీసులకు పట్టుబడ్డాడు కూడా. ఇతని కదలికలపై పోలీసులు నిఘా ఉంచగా, దీక్షా కుష్వాను హైదరాబాద్ కు తెచ్చినట్టు తెలుసుకున్నారు. పక్కా ప్లాన్ తో మఫ్టీలో రంగంలోకి దిగిన పోలీసులు, ఆమె గదిలోకి మరొకరు వెళ్లేంత వరకూ వేచిచూసి, ఆపై దాడి చేశారు. దీక్షతో పాటున్న విటుడిని, నిర్వాహకుడు జనార్దన్ ను అరెస్ట్ చేశారు. దీక్షను పునరావాస కేంద్రానికి తరలించామని వెల్లడించిన పోలీసులు, ఈ దందాలో ఇంకా ఎవరెవరు ఉన్నారన్న కోణంలో విచారిస్తున్నట్టు తెలిపారు.
Go Back to Shorts
Police
Mumbai
Heroin
Deeksha kushwa
Prostitution

More Telugu News