గంటా శ్రీనివాస్ ను టార్గెట్ చేసిన పవన్ కల్యాణ్!
- జూట్ మిల్లు సమస్య తెలియకనే గంటాకు మద్దతు ఇచ్చా
- మురళీమోహన్, అవంతిలాంటి వాళ్లకు ప్రచారం చేసి తప్పు చేశా
- టీడీపీ గూండాలను జనసైనికులు అడ్డుకోవాలి
విశాఖ జిల్లాలో భూకుంభకోణాలకు గంటా, అతని అనుచరులే బాధ్యత వహించాలని పవన్ అన్నారు. రానున్న ఎన్నికల్లో గెలవడానికి టీడీపీ గూండాలు అడ్డదారులు తొక్కుతారని... జనసైనికులు దీన్ని సమర్థవంతంగా అడ్డుకోవాలని చెప్పారు. విశాఖ రైల్వే జోన్ పై టీడీపీ ఎంపీలకు చిత్తశుద్ధి లేదని... జోనూ లేదు గీనూ లేదు అని అవంతి శ్రీనివాస్ అంటే... ఐదు కిలోల బరువు తగ్గడానికి ఒక్క రోజు దీక్ష చేస్తానని మురళీ మోహన్ అన్నారని... ఇలాంటివారికి ప్రచారం చేసి గెలిపించినందుకు బాధపడుతున్నానని చెప్పారు.