రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించిన కేటీఆర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించిన కేటీఆర్

  • కర్ణాటకలో ప్రకటించిన రుణమాఫీ అచ్చం మేము చేస్తున్నట్టుగానే ఉంది
  • తెలంగాణలో అధికారంలోకి వస్తే ఒక్క విడతలోనే రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ చెబుతోంది
  • అదే పని కర్ణాటకలో ఎందుకు చేయలేదు?
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. 'రాహుల్ గాంధీ గారు, కర్ణాటకలోని మీ సంకీర్ణ ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీ అచ్చం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీలా ఉంది. తెలంగాణలో అధికారంలోకి వస్తే ఒక్క విడతలోనే రుణమాఫీ చేస్తామని మీ పార్టీ చెబుతోంది. మీ నేతలు చెబుతున్నట్టు కర్ణాటకలో ఒకే విడతలో రుణమాఫీ ఎందుకు చేయడం లేదనే విషయం నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది' అంటూ ట్వీట్ చేశారు.

కర్ణాటకలో రైతు రుణమాఫీకి సంబంధించి రాహుల్ ట్వీట్ చేశారు. రైతులకు హామీ ఇచ్చిన విధంగా సంకీర్ణ ప్రభుత్వం అడుగులు వేస్తోందని చెప్పారు. ఈ ట్వీట్ కు సమాధానంగానే కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.
krt
Rahul Gandhi
farm loan

More Telugu News