'మీ కుమారస్వామి' సంగతేంటి?.. రాహుల్ ను ప్రశ్నిస్తున్న బీజేపీ!
- కర్ణాటకలో పెరిగిన ఇంధన ధరలు
- బడ్జెట్ లో ప్రతిపాదించిన కుమారస్వామి
- విరుచుకుపడిన బీజేపీ
దీనిపై స్పందించిన బీజేపీ, తన అధికార ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను పెడుతూ, "రాహుల్ గాంధీ 'ఫ్యూయల్ చాలెంజ్'ని తీసుకోవడానికి ఎవరూ ముందుకు రావట్లేదు. కనీసం ఆయన ప్రభుత్వం కూడా. ఇదే జరుగుతోంది" అని వ్యాఖ్యానించింది. ముందు కాంగ్రెస్ పార్టీ, తాను పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో 'పెట్రో' సుంకాలను తగ్గించి చూపించాలని ఎద్దేవా చేసింది. కాగా, ఇంధన ధరలను మే 30న ఒక్క పైసా మేరకు తగ్గించిన రోజున, రాహుల్ దీన్ని ఓ జోక్ గా అభివర్ణించిన సంగతి తెలిసిందే.