కానిస్టేబుల్ ను కిడ్నాప్ చేసి దారుణంగా చంపిన ఉగ్రవాదులు!
- నిన్న కిడ్నాప్ నకు గురైన జావేద్ అహ్మద్ దార్
- ఈ ఉదయం గ్రామ శివార్లలో మృతదేహం
- ఉగ్రవాదుల సమాచారం ఇచ్చాడన్న ఆగ్రహంతోనే హత్య
కానిస్టేబుల్ జావేద్ ఇంట్లోకి నిన్న ఉదయం బలవంతంగా ప్రవేశించిన ఉగ్రవాదులు, అతని కుటుంబీకులను బెదిరించి ఈ కిడ్నాప్ నకు పాల్పడ్డారు. ఈ సంవత్సరం ఏప్రిల్ లో అదే గ్రామంలోని ఓ ఇంట్లో తలదాచుకున్న ఐదుగురు ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టగా, వారి గురించిన సమాచారం జావేదే ఇచ్చాడన్న అనుమానంతో ఉగ్రవాదులు ఈ పని చేసినట్టు తెలుస్తోంది.
కానిస్టేబుల్ కిడ్నాప్ విషయాన్ని తెలుసుకున్న అధికారులు, ఈ ప్రాంతంలో భారీ ఎత్తున సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే అతని డెడ్ బాడీని ఈ ఉదయం కనుగొన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగిస్తామని అధికారులు తెలిపారు.