జియో ఫీచర్ ఫోన్ లో యూట్యూబ్, ఫేస్ బుక్, వాట్స్ యాప్... డేట్ అనౌన్స్ చేసిన ముఖేష్ అంబానీ

  • ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి
  • జియో రాకతో డిజిటల్ విప్లవాత్మకత
  • 2.5 కోట్ల మంది వద్ద జియో ఫీచర్ ఫోన్
చౌకధరలో లభిస్తున్న 4జీ ఫీచర్ ఫోన్ జియో ఫోన్ లో ఫేస్ బుక్, వాట్స్ యాప్, యూ ట్యూబ్ లు అందుబాటులోకి రానున్నాయని, అవి కూడా వాయిస్ కమాండ్ కంట్రోలింగ్ లో ఉంటాయని ముఖేష్ అంబానీ వెల్లడించారు. ఆగస్టు 15 నుంచి ఈ సేవలను రిలయన్స్ జియో ప్రజలకు అందుబాటులోకి తేనుందని అన్నారు.

డిజిటల్ విప్లవాత్మకత దిశగా ఇండియాను నడిపించేందుకు జియో పుట్టిందని వ్యాఖ్యానించిన ఆయన, ఇండియాలో ఇప్పటికీ ఇంటర్నెట్ సౌకర్యం లేని ఫీచర్ ఫోన్లను 50 కోట్ల మంది వాడుతున్నారని గుర్తు చేశారు. గత సంవత్సరం పూర్తి రిఫండబుల్ డిపాజిట్ తో రూ. 1,500కే జియో ఫోన్ ను అందించామని తెలిపారు. ఇది 'ఇండియా కా స్మార్ట్ ఫోన్' గా మారి 2.5 కోట్ల మంది చేతుల్లోకి చేరిందని వెల్లడించారు. ఈ స్కీమ్ కొనసాగుతుందని తెలిపారు.
Go Back to Shorts
Jio
Reliance
AGM
Mukesh Ambani

More Telugu News