ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన కేరళ రాజ్ భవన్ వాహనం.. జరిమానా విధించిన పోలీసులు
- వేగపరిమితిని దాటి ప్రయాణించిన రాజ్ భవన్ వాహనం
- సీసీ కెమెరాల్లో రికార్డు
- ఆ సమయంలో కారులో లేని గవర్నర్
కౌడియార్-వెల్లయంబళం దారిలో రాజ్ భవన్ కు చెందిన మెర్సిడెజ్ బెంజ్ ఈ-250 అత్యంత వేగంగా దూసుకెళ్లింది. అక్కడ ఏర్పాటు చేసిన అధునాతన కెమెరాలు దీనిని రికార్డు చేశాయి. కేరళ గవర్నర్ సెక్రటరి పేరుపై రిజిస్టర్ అయి ఉన్న ఈ వాహనం 55 కిలోమీటర్ల వేగ పరిమితిని దాటేసింది. నిజానికి గత కొంతకాలంగా ఈ వాహనాన్ని గవర్నర్ ఉపయోగంచడం లేదు. రాజ్ భవన్ కు సంబంధించిన వేరే పనులకు దానిని వినియోగిస్తున్నారు. కొసమెరుపు ఏమిటంటే, రాజ్ భవన్ ఉద్యోగులంతా తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలంటూ గవర్నర్ ఈ సందర్భంగా వారికి క్లాస్ పీకారట.