ttd: సీబీఐ విచారణ కోరుతూ దాఖలైన వ్యాజ్యం.. టీటీడీకి సమన్లు జారీ చేసిన హైకోర్టు!

షార్ట్స్‌లో చూడండి
టీటీడీలో నెలకొన్న వివాదాలపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. గుప్త నిధుల కోసం తవ్వకాలు, నగల మాయం, ఆదాయ వ్యయాలు తదితర అంశాలకు సంబంధించిన ఆరోపణలపై సీబీఐ చేత విచారణ జరిపించాలంటూ వేసిన పిల్ ను కోర్టు విచారించింది. ఈ సందర్భంగా టీటీడీ ఈవో, రాష్ట్ర దేవాదాయ శాఖలకు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లోగా పూర్తి వివరాలతో కూడిన ప్రమాణపత్రం దాఖలు చేయాలని ఆదేశించింది.

గుంటూరు జిల్లాకు చెందిన అనిల్ కుమార్, గుజరాత్ కు చెందిన భూపేందర్ గోస్వామి అనే ఇద్దరు వ్యక్తులు గతంలో ఈ పిల్ ను దాఖలు చేశారు. సీబీఐ విచారణ జరిపించాలని వారు కోరారు.
Go Back to Shorts
ttd
High Court
cbi

More Telugu News