babli project: సుప్రీం ఆదేశాలతో తెరుచుకున్న బాబ్లీ గేట్లు.. తెలంగాణకు పరుగులు పెడుతున్న గోదావరి

షార్ట్స్‌లో చూడండి
మహారాష్ట్రలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరుచుకున్నాయి. ప్రతి ఏటా జూన్ 30వ తేదీ అర్ధరాత్రి దాటాక బాబ్లీ గేట్లు ఎత్తి, నీటిని కిందకు వదలాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ ఉదయం గేట్లను ఎత్తారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, బాబ్లీ ప్రాజెక్టు, కేంద్ర జల సంఘం అధికారులు ఈ ఉదయం ప్రాజెక్టు వద్దకు చేరుకుని, గేట్లు ఎత్తారు. రెండు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. సాయంత్రంకల్లా 14 గేట్లు ఎత్తనున్నారు.

ప్రస్తుతం జలాశయంలో 0.56 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ నేపథ్యంలో రేపు ఉదయం శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీరు చేరనుంది. ఈ రోజు నుంచి అక్టోబర్ 28 వరకు బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరిచి ఉంటాయి. ఈ నేపథ్యంలో బాసర పుణ్యక్షేత్రం వద్ద పుణ్యస్నానాలు ఆచరించే భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Go Back to Shorts
babli project
gates
srsp
godavari

More Telugu News