Telugudesam: ఉత్తరాంధ్రలో పవన్‌ కల్యాణ్‌ భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారు: ఎమ్మెల్యే బండారు

షార్ట్స్‌లో చూడండి
ఉత్తరాంధ్రలో పర్యటిస్తోన్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ చేస్తోన్న వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌ ఉత్తరాంధ్రలో భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారని అన్నారు. ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొడుతూ అశాంతిని సృష్టించకూడదని, ఆ ప్రాంతంలో ఏపీ సర్కారు చేసిన అభివృద్ధి కనబడట్లేదా? అని ప్రశ్నించారు.

పవన్‌ కల్యాణ్‌ నటుడిగా కాకుండా ఓ రాజకీయ నాయకుడిలా ఆలోచించి మాట్లాడాలని బండారు సత్యనారాయణ సూచించారు. ఆయన కేంద్ర సర్కారుని ఎందుకు నిలదీయట్లేదని ప్రశ్నించారు.              
Go Back to Shorts
Telugudesam
Andhra Pradesh
Pawan Kalyan

More Telugu News