జీఎస్టీలోకి 'పెట్రో' వద్దేవద్దు... అంగీకరించే సమస్యే లేదన్న యనమల!
- సమాఖ్య స్ఫూర్తిని కాపాడాలనే జీఎస్టీకి మద్దతు
- కేంద్రం తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తోంది
- రాష్ట్రాలపై పెత్తనాన్ని అడ్డుకుంటామన్న యనమల
తన అధికారంతో రాష్ట్రాలపై పెత్తనం సాగిస్తున్న కేంద్రాన్ని అడ్డుకుంటామని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలు తగ్గకుండా పన్ను విధానాలుండాలని అభిప్రాయపడ్డ యనమల, జీఎస్టీ పరిధిలోకి పెట్రోలు, మద్యం ఉత్పత్తులను తెచ్చేందుకు తాము అంగీకరించే సమస్యే లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రాల ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే వీటిపై పన్ను రూపంలో లభించే ఆదాయమే కీలకమని అన్నారు.