అండగా ఉంటాడని నమ్మితే వంచించాడు... నటిగా అవకాశాలిప్పిస్తానని వాడుకున్నాడు: సమీర
- టీవీ సీరియల్స్ లో నటిస్తున్న సమీర
- ప్రియుడితో విభేదాలు వచ్చి విడిపోయిన సమీర
- కేసు పెట్టినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపణ
చేతిపై బ్లేడ్ గాయాలు చూపుతున్న సమీరటీవీ సీరియల్స్ లో అవకాశాలు ఇప్పిస్తానని తనను ఫిరోజ్ దారుణంగా మోసం చేశాడని, మనస్పర్థలు వచ్చి తామిద్దరం విడిపోయామని చెప్పింది. ఆ తరువాత కీర్తితో ఫిరోజ్ పరిచయం పెంచుకున్నాడని, తన చేతులపై బ్లేడుతో కీర్తే గాట్లు పెట్టిందని చెబుతూ వాటిని మీడియాకు చూపింది. తనను గంటపాటు అర్ధనగ్నంగా రోడ్డుపై నిలబెట్టారని, తననుంచి లక్షన్నర విలువ చేసే వాచీ, రెండు సెల్ ఫోన్లను లాక్కెళ్లారని వాపోయింది. పోలీసులు ఇంతవరకూ వారిని అరెస్ట్ చేయలేదని, తన పలుకుబడితో పోలీసులను ఫిరోజ్ మేనేజ్ చేస్తున్నాడని ఆరోపించింది. ఇప్పటికీ తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెబుతూ, ఫిరోజ్ కు, తనకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణల రికార్డును వినిపించింది.