Vizag: 'సమరసింహారెడ్డి' నిర్మాత చెంగల వెంకట్రావు... ఈ స్థితిలో ఉన్నారా? అని ఆశ్చర్యపోయిన విశాఖ కలెక్టర్!

షార్ట్స్‌లో చూడండి
ఈ ఫొటోలో కటకటాల వెనకున్నది ఎవరో తెలుసా? బాలకృష్ణతో 'సమరసింహారెడ్డి' సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత, మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు. అక్కడ ఎందుకున్నాడో తెలుసా? ఓ హత్యకేసులో యావజ్జీవ శిక్షను అనుభవిస్తూ, ఆరోగ్యం బాగాలేక విశాఖ కేజీహెచ్ ఆసుపత్రిలోని ఖైదీలు చికిత్స పొందే విభాగంలో ఉన్నారు.

ఇక ఆసుపత్రి తనిఖీ నిమిత్తం వెళ్లిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్, చెంగల ఉన్న విభాగానికి వెళ్లి, అక్కడున్న ఖైదీలకు ఎటువంటి వైద్య సేవలు అందుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ సమయంలోనే పక్కన ఉన్న అధికారులు, ఆయన ప్రముఖ నిర్మాతని, మాజీ ఎమ్మెల్యే అని, యావజ్జీవ జైలు శిక్ష అనుభవిస్తున్నారని చెప్పడంతో కలెక్టర్ ఆశ్చర్యపోయారట.

కాగా, పాయకరావుపేట అసెంబ్లీకి 2004లో ఎమ్మెల్యేగా గెలిచి, ఆపై 2009లో ఓడిపోయిన వెంకట్రావు, 2014లో వైసీపీలో చేరి ఓడిపోయారు. 2007లో నక్కపల్లి ప్రాంతంలో ఓ కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన గొడవలో ఓ మత్స్యకారుడు మరణించగా, ఆ కేసులో వెంకట్రావు దోషిగా నిరూపితమై శిక్షననుభవిస్తున్నారు.
Go Back to Shorts
Vizag
KGH
Changala Venkatram
Jail

More Telugu News