ఏపీకి మరో ప్రాజక్ట్.. నాగాయలంకలో క్షిపణి ప్రయోగ కేంద్రం.. కేంద్రం గ్రీన్ సిగ్నల్!
- గుల్లలమోదలో క్షిపణి ప్రయోగ కేంద్రం
- తొలి విడతలో రూ.600 కోట్లతో పనులు
- దసరా నుంచే పనులు ప్రారంభం
- నేడో, రేపో పర్యావరణ అనుమతులు
నిజానికి దేశంలో మరో క్షిపణి ప్రయోగ కేంద్రం అవసరమని డీఆర్‌డీవో నిపుణులు ఏడేళ్ల క్రితమే ప్రతిపాదించారు. నాగాయలంక మండలంలోని గుల్లలమోద ఇందుకు అనుకూలంగా ఉన్నట్టు గుర్తించారు. సముద్ర తీరానికి కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో క్షిపణి పరీక్షలకు అనువుగా ఉంటుందని భావించిన నిపుణులు కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు.
క్షిపణి ప్రయోగ కేంద్రం ప్రతిపాదన రాగానే రాష్ట్ర ప్రభుత్వం మరోమాటకు తావులేకుండా వెంటనే ఆమోదించింది. అందుకు అవసరమైన భూమిని కేటాయించింది. కొంత భూమి తగ్గడంతో అటవీశాఖ నుంచి తీసుకుని, దానికి మరో ప్రాంతంలో భూమి ఇచ్చింది. భూసేకరణ, నిర్వాసితులు వంటి చిక్కులు ఏర్పడినా ప్రభుత్వం వాటిని సమర్థంగా పరిష్కరించింది. మరోవైపు సుప్రీంకోర్టు గ్రీన్ బెంచ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖలు కూడా మరో రెండు మూడు రోజుల్లో ఆమోదం తెలపనున్నాయి.