పవిత్ర అమర్ నాథ్ యాత్రకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు... 28 నుంచి యాత్ర మొదలు
- భద్రతా విధుల్లో 40,000 మంది
- ప్రతీ వాహనానికి ఆర్ఎఫ్ ట్యాగ్
- ఈ ఏడాది యాత్రకు 1.5 లక్షల మంది పేర్ల నమోదు
ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో భక్తులను తీసుకెళ్లే ప్రతీ వాహనానికి రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్ ఏర్పాటు చేసి వాటిని పర్యవేక్షించాలని, జమ్మూ కశ్మీర్ పోలీసులు, ఆర్మీ, పారా మిలటరీ దళాల మధ్య సమన్వయం కోసం ఓ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. యాత్రా మార్గంలో వివిధ బలగాలన్నీ కలసి 40,000 మంది రక్షణ విధుల్లో పాలు పంచుకోనున్నారు. సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. డాగ్ స్క్వాడ్స్, తక్షణం ప్రతిస్పందించే బృందాలు కూడా రంగంలోకి దిగుతున్నాయి. గతేడాది 2.60లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకోగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 1.5 లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు.