ys jagan: ఓ చిన్నారికి అక్షరాభ్యాసం.. ‘వైఎస్’ అని రాయించిన జగన్!

షార్ట్స్‌లో చూడండి
తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర నేడు 197వ రోజు సాగింది. ఈ సందర్భంగా జగన్ ని కలిసేందుకు అభిమానులు, కార్యకర్తలు, పార్టీ నేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా జగన్ తో పలువురు సెల్ఫీలు దిగారు. గెద్దాడలో పర్యటించిన జగన్, ఓ చిన్నారికి అక్షరాభ్యాసం కూడా చేశారు. ఆ చిన్నారితో పలకపై ‘వైఎస్’ అనే అక్షరాలను రాయించి దిద్దించారు. కాగా, జగన్ చేపట్టిన పాదయాత్ర  లక్కవరం వద్ద 2,400 కిలోమీటర్ల మైలు రాయిని చేరుకున్న విషయం తెలిసిందే.   
Go Back to Shorts
ys jagan
praja sankalpa yatra

More Telugu News